కపిలేశ్వరపురం మండలం పరిధి అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలను బుధవారం నిర్వహించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లో వైద్యాధికారి డా. బి.అనంత రామకృష్ణ ఆధ్వర్యంలో 21 మంది గర్భిణీలను పరీక్షించి, రక్త పరీక్షలు జరిపి, ఉచితంగా మందులను అందజేశారు. వారిలో ఇద్దరిని హైరిస్క్ గర్భిణీలుగా గుర్తించి కపిలేశ్వరపురం సి.హెచ్.సి.కి రెఫరల్ చేసినట్లు తెలిపారు