కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో శృంగవరం గ్రామ సమీపంలో లారీ ఢీకొని ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కాకినాడకు తరలించగా, మార్గమధ్యంలో ఒక మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.