అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా శంఖవరం గ్రామానికి చెందిన పర్వతసురేష్ నియమితులయ్యారు. మంగళవారం ఆయన స్వామివారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సురేష్‌ను శాలువా, పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం తనకు కలిగిందని, ఈ అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.