మంగళవారం, కాకినాడలోని జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి రెండేళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. నియోజకవర్గానికి శాఖల వారీగా 468 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.