రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

బలరాంపురంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు హామీ మేరకు గత ప్రభుత్వ గుర్తులను తొలగించి, ప్రభుత్వ రాజముద్రతో నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్