ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు నేతృత్వంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గంజాయి సేవిస్తున్నారనే అనుమానంతో 21 మందిని పరీక్షించగా, ఒకరికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సిలింగ్‌తో పాటు డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా మార్పు తీసుకురావడానికి చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.