ప్రత్తిపాడు: టిప్పర్లు ఆపకుంటే దీక్షకు దిగుతా

ప్రజలకు ప్రమాదకరంగా మారిన టిప్పర్ల రాకపోకలను ఆపకపోతే నిరాహార దీక్ష చేపడతానని సామాజికవేత్త, జనసేన నాయకుడు మేకల కృష్ణ అన్నారు. శంఖవరంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శంఖవరం, కత్తిపూడి మీదుగా వెళ్లే రాయి, పిక్క, గ్రావెల్ భారీ వాహనాలతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయన్నారు. పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఉపయోగం లేదన్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోతే త్వరలోనే నిరాహార దీక్ష చేపడతానన్నారు.

సంబంధిత పోస్ట్