ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం, ఒమ్మంగిలో మత్తు పదార్థాల వినియోగంపై స్థానికులకు అవగాహన కల్పించారు. గంజాయి రవాణా, వినియోగంపై సమాచారం ఉంటే 1972 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.