అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన సానా శ్రీనివాసరావు దంపతులు రూ. 1,01,116 విరాళంగా అందజేశారు. జూన్ 1న తమ పేరుతో అన్నదానం నిర్వహించేందుకు ఈ మొత్తాన్ని ఆలయ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు దాతలకు ఆశీర్వచనం అందజేయగా, అధికారులు ప్రసాదం, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. భక్తులు అన్నదాన కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయమని ఆలయ అధికారులు పేర్కొన్నారు.