అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి నిత్య అన్నదాన పథకానికి భీమవరం వాస్తవ్యులు లేటు ఈదర వెంకట సత్యనారాయణ, మంగాయమ్మ, వెంకయ్యల స్మారకార్థం నాగ వెంకట సుబ్బారావు రూ. 2 లక్షలు విరాళంగా అందజేశారు. ఫిబ్రవరి 20న అన్నదానం నిర్వహించాలని ఆయన కోరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అనంతరం దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తారు.