సత్యదేవుని అన్నదాన పథకానికి రూ. 2 లక్షల విరాళం

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన బి. శ్రీనివాస్ కుమార్ కుటుంబ సభ్యులు సోమవారం రూ. 2,00,116 విరాళంగా అందజేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులకు చెక్కును అందించారు. అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందించి, ప్రసాదాలను అందజేశారు. భక్తుల సహకారంతో అన్నదాన పథకం విజయవంతంగా కొనసాగుతోందని ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్