అన్నవరం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ గా శిరీష నియామకం

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా పిఠాపురానికి చెందిన తోలేటి శిరీష నియమితులయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న శిరీష కష్టానికి తగిన గుర్తింపు లభించిందని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. శిరీష తన నియామకంపై కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్