మంత్రి లోకేష్ చేతుల మీదుగా విద్యార్థిని స్వాతికి ఘన సత్కారం

పదో తరగతి పరీక్షల్లో 594 మార్కులతో విశిష్ట ప్రతిభ కనబరిచిన శంఖవరం ఆదర్శ పాఠశాల విద్యార్థిని సైపిరెడ్డి స్వాతిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో నగదు ప్రోత్సాహకం, సాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఆమె ప్రతిభను అభినందించిన మంత్రి, ప్రతి విద్యార్థి లక్ష్యసాధనకు కృషి చేసి పోటీతత్వంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్, ఎంఈఓ ఎస్. వి. రమణ, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు సురేష్, విద్యా కమిటీ చైర్‌పర్సన్ లక్ష్మీజ్యోతి, ప్రిన్సిపాల్ వీర్రాజు, తల్లిదండ్రులు, గ్రామస్తులు స్వాతిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్