రాష్ట్ర ఉప లోకాయుక్త, ఇంఛార్జ్ లోకాయుక్త జస్టిస్ పీ. రజని శనివారం అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు ఆధ్వర్యంలో ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు. వ్రత పురోహితులు జస్టిస్ రజనికి క్షేత్ర విశిష్టతను వివరించారు.