మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు, ఐఆర్ఎస్ అధికారి గోపినాథ్, ఎమ్మెల్యే దివ్య దంపతులు శుక్రవారం తిరుమల వెంకన్న సేవలో తరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వారు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు.