ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం 620 మందికి కొత్తగా వితంతు పింఛన్లు మంజూరయ్యాయి. ప్రత్తిపాడు మండలానికి 182, రౌతులపూడికి 156, శంఖవరానికి 113, ఏలేశ్వరం మండలానికి 115, ఏలేశ్వరం పట్టణానికి 54 పింఛన్లు అందాయి. శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.