ఏలేశ్వరం: అమృత్ 2.0 కింద ఇంటింటికీ కుళాయి ప్రాజెక్ట్ పనులు ప్రారంభం

ప్రత్తిపాడులో అమృత్ 2.0 పథకం కింద ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చే ప్రాజెక్ట్ కోసం స్థల పరిశీలన జరిగింది. ఏలేరు రిజర్వాయర్‌ను ప్రధాన నీటి వనరుగా ఉపయోగించుకుని 32 MLD సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కాకినాడ కార్పొరేషన్‌తో పాటు పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం పట్టణాలకు కూడా తాగునీరు అందుతుంది. అమృత్ 2.0 కింద రూ.391.2 కోట్లు, AIIB నిధుల కింద రూ.141.74 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2026 మార్చి 30 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్