నకిలీ రక్తదాతల మోసాలపై అజయ్ కుమార్ హెచ్చరిక

మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గారా అజయ్ కుమార్, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు కొందరు కేటుగాళ్ళు సోషల్ మీడియా ద్వారా సమాచారం సేకరించి, రక్తదానం చేస్తామని చెప్పి, ప్రయాణ ఖర్చుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని తెలిపారు. రక్తదాతలు స్వచ్ఛందంగా సేవ చేస్తారని, డబ్బులు డిమాండ్ చేయరని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తం అవసరమైతే ముందుగా కుటుంబ సభ్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సంఘటనలు తూర్పు గోదావరి, రాజమండ్రి సిటీలో చోటు చేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్