ఘనంగా బీవీఎం స్కూల్ యాన్యువల్ డే సంబరాలు

రాజమండ్రిలోని లలిత నగర్ బీవీఎం స్కూల్‌లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు నృత్యాలు, నాటికలు, దేశభక్తి గీతాలు, ఆధునిక డాన్స్ ప్రదర్శనలతో అలరించారు. చిన్నారుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని యాజమాన్యం సూచించింది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్