మే 8న APEDCET-2026 ప్రవేశ పరీక్ష

APEDCET-2026 ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆదికవి నన్నయ్య వర్సిటీ విద్యా కళాశాల ప్రిన్సిపల్ డా. కొండ్రు సుబ్బారావు బుధవారం తెలిపారు. మే 8వ తేదీ శుక్రవారం ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని 16 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అభ్యర్థులు నిబంధనల ప్రకారం పరీక్షకు హాజరు కావాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్