రాజకీయ గొడవలను కులాలకు ఆపాదించడం సమాజానికి మంచిది కాదు

వైసీపీ చేపడుతున్న కుల రాజకీయాలకు నిరసనగా గీత కుల సంఘీయులు సోమవారం రాజమండ్రిలోని లాలాచెరువు సెంటర్ సమీపంలోని మహానేత దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇటీవల 40వ వార్డులో చోటుచేసుకున్న రాజకీయ ఘర్షణను కావాలనే కుల వివాదంగా చిత్రీకరిస్తూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో జరిగిన శెట్టిబలిజ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన సంఘటనల వాస్తవాలను ఏకపక్షంగా వివరించి పెద్దలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్