ఆటో కార్మికులే మన పార్టీకి ప్రచార వారధులు

ఆదివారం రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో ఆటో కార్మికులతో మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో కార్మికులకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అండగా ఉన్నారని, వారంతా వైసీపీ సంస్థాగత పటిష్టతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్