బీజేపీ నేత రజిని సరస్వతీ దేవిని దర్శనం

బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిపాటి స్వర్ణ రజిని రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న సరస్వతీ దేవి అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త తోట సుబ్బారావు ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించారు. భారత దేశ అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. అనంతరం సరస్వతీ అమ్మవారి డాలర్ ప్రతిమ, పుస్తకం ఆమెకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేంద్ర కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్