రాజమండ్రిలో భాజపా 'జనతా వారధి' కార్యక్రమం: ఫిర్యాదుల స్వీకరణ

ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి భారతీయ జనతా పార్టీ రాజమండ్రి కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించనున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తారు. జిల్లాలోని మండల, గ్రామాల నుంచి గుర్తించిన లేదా ప్రజలు తమ వద్దకు తెచ్చిన సమస్యలకు సంబంధించిన అర్జీలను 'జనతా వారధి' ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన వెల్లడించారు. సమస్య మీది - పరిష్కారం మాది అని నాగేంద్ర పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్