99వ రోజుకు చేరుకున్న సమ్మర్ బ్లడ్ డ్రైవ్

రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో మన బాధ్యత ఫౌండేషన్ చేపట్టిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ నిర్విరామంగా కొనసాగుతూ 99వ రోజుకు చేరుకుంది. రక్తదానం అనేది నిరంతర కృషి అని, ప్రాణాలు కాపాడటానికి యువతలో అవగాహన కీలకమని, ప్రజల మద్దతుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. రక్తదాతలు ప్రత్యేకంగా జన్మించరని, అందరూ రక్తదానం చేయాలని, అది మన బాధ్యత అని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్