మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారా అజయ్ కుమార్, రక్తదాతలు అందుబాటులో ఉన్నప్పుడే బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల నుండి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు చికిత్స కోసం రక్తం అవసరమైనప్పుడు, ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకే సేకరిస్తామని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలో తగిన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆయన కోరారు.