రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దళారుల వ్యవస్థ కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ ఆదివారం విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలో విఫలమైందని, వైద్యం దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన నిలబడి, దళారుల వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమం చేపడతామని మేడా శ్రీనివాస్ తెలిపారు.