రెరా చట్టం-2016 పై ప్రజలకు సమగ్ర అవగాహన

ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రెరా చట్టం-2016 పై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ ఆరే శివారెడ్డి తెలిపారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణే లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్