సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి గ్రూప్ వన్ అధికారిగా కర్రి రాజా రమేష్ బాబు

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కర్రి రాజా రమేష్ బాబు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే గ్రూప్ వన్ పరీక్షలో విజయం సాధించి ప్రభుత్వ సేవలోకి అడుగుపెట్టారు. చిన్ననాటి నుంచి సివిల్స్‌లో సేవ చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమవుతూ ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. ప్రభుత్వ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చినా, సివిల్స్ ప్రిపరేషన్‌కు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలి మళ్లీ సాఫ్ట్‌వేర్ రంగంలో చేరి సన్నద్ధత కొనసాగించారు. చివరకు గ్రూప్ వన్ పరీక్షలో విజయం సాధించి స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియామకం పొందారు.

సంబంధిత పోస్ట్