తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 2,35,031 మంది లబ్ధిదారులకు రూ. 103.17 కోట్లు పంపిణీ చేసేందుకు 4975 మంది PDOలను నియమించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నాటికి 88% మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది.