రాజమండ్రిలోని క్వారీ మార్కెట్ సెంటర్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైన ఎగ్ కార్ట్ యూనిట్‌ను ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు ప్రారంభించారు. మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడంలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఆసక్తిగల మహిళలు నగర పాలక సంస్థలోని మెప్మా విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.