రాజమండ్రి ఇన్నీసుపేట శాఖ గ్రంథాలయంలో శుక్రవారం, పౌర గ్రంథాలయ శాఖ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉమ్మడి తూర్పుగోదావరి ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులను, శిక్షణ పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను ఆయన అభినందించారు. వేసవి విజ్ఞాన తరగతులు చిన్నారుల మేధస్సు కు దోహదం చేస్తాయని తెలిపారు.