మానవ హక్కుల పరిరక్షణ మరియు అవగాహన మండలి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, ఉప్పాడ మౌనిక రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరిలోని రాజమండ్రి సిటీ, బొమ్మూరు లెప్రసీ కాలనీలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది కుష్టు రోగులకు ఉచిత భోజనం అందించారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సంస్థ సెక్రటరీ కె. బిందు చౌదరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సత్య గుమ్మాపు, డాక్టర్ కె.ఎం. జగదీష్ నాయుడు, కొమ్మిరెడ్డి ప్రభావతి, కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.