మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, దీనిపై త్వరలోనే అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తనను హౌస్ అరెస్ట్ చేయడం తగదని, ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ బాధ్యతను విస్మరించినట్టుగా ఉన్నాయని విమర్శించారు. పాలకొల్లులో తనను అరెస్ట్ చేయడంపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు.