ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

రాజమండ్రిలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించనున్న ఆర్చ్ నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సుమారు రూ. 20 లక్షల వ్యయంతో ఈ ఆర్చ్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్