ఆదివారం గౌతమి ఘాట్ వద్ద జరిగిన “యోగాంధ్ర” కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గంటా స్వరూప రాణి పాల్గొన్నారు. టూరిజం శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆరోగ్య చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఆమె తెలిపారు. మేఘ స్వరూప్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. అధికారులు, సిబ్బంది, యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు నిర్వహించారు.