కొవ్వూరు నియోజకవర్గంలోని సొసైటీ అధ్యక్షుల నియామకంలో టీడీపీ కూటమి ధర్మాన్ని పాటించలేదని జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన వద్ద గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆందోళన చేపట్టారు. మొత్తం 14 సొసైటీలు ఉండగా జనసేనకు కేవలం ఒక్కటి కేటాయించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కడదారి నవ్య, తదితరులు పాల్గొన్నారు.