పోరాడిన రైతుల త్యాగాలకు న్యాయం జరిగింది

రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ఒక స్వర్ణయుగం అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మక ఘట్టమని ఆయన తెలిపారు. అమరావతి రాజధాని కోసం ఏళ్ల తరబడి పోరాడిన రైతుల త్యాగాలకు ఇది గౌరవం అని, కేంద్రానికి పంపేందుకు అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేశాక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్