నూతనంగా ఎన్నుకోబడిన సీరత్ కమిటీ కార్యవర్గం గురువారం కాకినాడ జగన్నాధపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు నుండి కాకినాడ సిటీ నియోజకవర్గ సీరత్ కమిటీ అధ్యక్షులుగా రహీమ్ తోపాటు పలువురిని ఎన్నుకోవడం జరిగిందన్నారు.