రాజమండ్రిలోని గౌతమి ఘాట్ వద్ద ఆదివారం జిల్లా స్థాయి "యోగాంధ్ర" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జేసీ మేఘ స్వరూప్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప పాల్గొన్నారు. వారు యోగా ఆసనాలు సాధన చేసి, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.