రైలు ఢీ కొని వ్యక్తి మృతి

రాజమహేంద్రవరం నగరంలోని సరస్వతి ఘాట్ సమీపంలో సోమవారం ఉదయం రైలు ఢీకొని సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. 5.3 అడుగుల ఎత్తు, నారింజ రంగు చొక్కా, ముక్కుపొడుం రంగు ఫ్యాంట్ ధరించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని జీఆర్పీ ఇన్స్పెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్