ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ షాప్ లీగ్ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ విజయంపై రాజమండ్రి నుంచి పాల్గొన్న క్రీడాకారిణులు, కోచ్‌లు గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ద్వితీయ స్థానం సాధించడం తమకెంతో గర్వకారణమని వారు పేర్కొన్నారు.