రాజమండ్రి సిటీలోని రాజమహేంద్రవరం క్వారీ ఏరియాలో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన చందనయాత్ర మహోత్సవానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని, నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్లను ఆయన అభినందించారు. అనంతరం సిబ్బందితో కలిసి సెల్ఫీ దిగి సందడి చేశారు.