రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కడియం మండలం మురమండ గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ట చేసిన శ్రీ పర్వతాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 25,000 విరాళం అందించారు. ఈ మొత్తాన్ని సోమవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి రామారావు చౌదరి, ఇళ్లకు హనుమంతు, అధికారి భాస్కర్, మచ్చ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.