బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు తగరం సురేష్ బాబు ఆధ్వర్యంలో రాజమండ్రిలో శనివారం 'ప్రగతి పాదయాత్ర' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని, దివాన్ చెరువు నుంచి నేషనల్ హైవే వరకు ప్రజలతో కలిసి నడిచారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ హైవే విస్తరణ నిర్మాణం జరుగుతోందని ఆమె తెలిపారు.