స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రిలోని నందమూరి తారకరామారావు మున్సిపల్ పార్కులో గురువారం ఆయన విగ్రహానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.