తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలోని ఓఎన్జిసి బేస్ కాంప్లెక్స్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు డిసెంబర్ 6, 2025న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతందాస్, హైకోర్టు అడ్వకేట్ కదిరే కృష్ణ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జిసి ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.