తొర్రెడులో వైభవంగా పార్వతి రామలింగేశ్వర స్వామి కల్యాణం

రాజమండ్రి రూరల్, తొర్రెడు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వైశాఖమాసం ఏకాదశి సోమవారం సాయంత్రం పార్వతి రామలింగేశ్వర స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. దాసరి గురుప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈ.ఓ ఉష సంధ్య, ప్రధాన అర్చకులు ఆంజనేయులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుకూరి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. కమిటీ వారు భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్