తూర్పు గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి నిర్దిష్టంగా ప్రారంభమైందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,68,564 మంది లబ్ధిదారులకు రూ. 118,84,95,000ల పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు. సోమవారం రాజమండ్రిలోని 41వ వార్డు ఆవా బాంబే కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పర్యవేక్షించారు.