సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం సూచించారు. తాళం వేసిన ఇళ్లే దొంగలకు లక్ష్యమని, దీనిని అరికట్టడానికి పోలీసులు ప్రవేశపెట్టిన 'లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్' (LHMS) యాప్‌ను వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రయాణ వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు.